ఉయ్యూరు చర్చిలో ప్రార్థనలు..
షర్మిల పాదయాత్రం ఆదివారం ఉదయం ఉయ్యూరు సీబీఎం కాంపౌండ్ నుంచి బయలుదేరింది. అక్కడే ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పామర్రు నియోజకవర్గంలోని మంటాడ చేరుకున్నారు. అక్కడ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మంటాడలో ఏర్పాటుచేసిన రచ్చబండలో పాల్గొని మహిళలు, రైతుల కష్టాల్లో పాలుపంచుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి తాడంకి, గోపువానిపాలెం అడ్డరోడ్డు, కనుమూరు, కురుమద్దాలి, ఉరుటూరు రోడ్డు మీదుగా పామర్రు చేరుకున్నారు. కనుమూరులో మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.
షర్మిలను కలుసుకున్న కార్మికులు..
కురుమద్దాలిలోని బ్లూ పార్కు వద్ద రొయ్యల పరిశ్రమలో పనిచేసే కార్మికులు, కేరళ నుంచి వలస వచ్చిన కార్మికుల కుటుంబాలు షర్మిలను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకొన్నాయి. పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. కురుమద్దాలి పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు హారతులు పట్టారు. అక్కడ పార్టీ జెండాను ఎగురవేసి వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర ప్రారంభించి 107 రోజులు పూర్తయిన సందర్భంగా పామర్రులోని మూలమలుపులో భారీ కేకును షర్మిల కట్ చేశారు. అదే ప్రాంతంలో కొందరు వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని షర్మిలకు బహూకరించారు. అనంతరం పామర్రులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాదయాత్రలో ఉన్న కుమార్తె షర్మిలను కనుమూరు వద్ద కలిసి యోగక్షేమాలు విచారించారు.
పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నాయకులు ఆర్కే, వాసిరెడ్డి పద్మ, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ఉప్పులేటి కల్పన, తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు, తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే ముసునూరి రత్నబోస్, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, పార్టీ నేతలు పి.గౌతమ్‌నెడ్డి, సింహాద్రి రమేష్, నందమూరి శ్రీనివాసరత్నాకర్, ఆరేపల్లి నాగరమేష్, మాదివాడ రాము, వంగవీటి శ్రీనివాసప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, వడ్లమూడి నాని, కలకొండ రవికుమార్, కాజా రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంటాడ వద్ద ఏఎంసీ మాజీ చైర్మన్ మేరుగ సుబ్బారావు షర్మిలను కలుసుకున్నారు.
CurrentFire:
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం అన్ని రకాల కేటగిరీలపై విద్యుత్ చార్జీలను భారీగా పెంచటంతో ఇంటింటా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్‌చార్జీల పేరుతో జనాన్ని దోపిడీ చేస్తున్న కిరణ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సమాయత్తమవుతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేయకుండా చార్జీల భారం మోపడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ, ఇతర ప్రజాసంఘాలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
జిల్లాలో 13.83 లక్షల మంది వినియోగదారులపై దాదాపు ఏడాదికి రూ.400 కోట్ల భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జిల్లాలో ప్రతి నెలా (ఎల్‌టీ) గృహాలు, ఇతర కేటగిరీ వినియోగదారుల నుంచి రూ.50 కోట్లు, హెచ్‌టీ కేటగిరీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇతర వినియోగదారుల నుంచి మరో రూ.50 కోట్లు ఏపీఎస్‌పీడీసీఎల్‌కు ఆదాయం వస్తుంది. జిల్లాలో నెలకు దాదాపు వంద కోట్లు చొప్పున వినియోగదారులు ఏడాదికి రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీలు చెల్లిస్తారు. ప్రభుత్వం పెంచిన చార్జీల ప్రకారం ప్రతి బిల్లుపై కనీసం 30 శాతం అధికంగా వినియోగదారులపై భారం పడనుంది. వాడకం పెరిగితే ఇది 40 నుంచి 50 శాతానికి పెరిగే అవకాశముంది.
ఈ ప్రకారం నెలకు వాడకాన్ని బట్టి రూ.30 కోట్ల చొప్పున ఈ ఏడాది రూ.360 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడుతుందని చెబుతున్నారు. పెంచిన టారిఫ్ ప్రకారం చూస్తే పేద వర్గాల వారికి రోజుకు రూ.4 చొప్పున నెలకు రూ.120 అదనపు భారం పడుతుంది. మధ్యతరగతి ప్రజలపై రోజుకు కనీసం రూ.10 చొప్పున నెలకు రూ.300 బిల్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని విద్యుత్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బడ్డీకొట్లు, చిన్న చిన్న వ్యాపారులపై నెలకు రూ.300 నుంచి రూ.1000 వరకు అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. హెచ్‌టీ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఇప్పుడు చెల్లిస్తున్న బిల్లుపై కనీసం 40 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
ముందుచూపు లేకే..
విద్యుత్తు రంగం విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం, ఉత్పత్తి, వినియోగం విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. ఒకవైపు ఇతర రాష్ట్రాలు తక్కువ రేటుతో విద్యుత్తు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం కోతలు విధిస్తున్నారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులకు నిరంతరం కరెంటు సరఫరా చే యకపోగా భారాలు మాత్రం మోపుతున్నారు.
- డాక్టర్ ఎంఎల్ నాయుడు, విజయవాడ
సామాన్యుడు బతికేదెలా?
అసలే విద్యుత్తు కోతలతో సతమతమవుతుంటే చార్జీలు పెంచటం దారుణం. బల్బు, ఫ్యాన్ వినియోగానికే రూ.400 బిల్లు వచ్చే పరిస్థితి ఉంటే సామాన్యుడు ఎలా బతికేది? ప్రభుత్వం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి. లేకపోతే ప్రజలు తిరగబడతారు. ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో చార్జీల భారం మోపలేదు.
- కొమెర ఆదాం, ప్రైవేట్ ఉద్యోగి, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం
ప్రభుత్వ పతనం ఖాయం
సర్‌చార్జీల పేరుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు యూనిట్ చార్జీలు పెంచిన ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టించిన ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించలేదు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరకొచ్చాయి.
- జంజనం సుబ్రమణ్యం,పెనుగంచిప్రోలు
మోయలేని భారం
విద్యుత్తు చార్జీలు ఇష్టమొచ్చినట్లు పెంచిన ప్రభుత్వం గృహ వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపింది. విద్యుత్తు పేరు చెబితేనే భయం వేసే పరిస్థితి ఏర్పడింది. గృహ అవసరాలకు కూడా విద్యుత్తు వాడలేని దుస్థితి నెలకొంది. పేద, మధ్య తరగతి వర్గాలు బిల్లులు చెల్లించలేక నానా అగచాట్లు పడాల్సి వస్తుంది.
- మామిడి జ్యోతి,గృహిణి, పెనుగంచిప్రోలు
చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
సామాన్య ప్రజల బాధలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎడాపెడా విధిస్తున్న కోతలు, ఆపై మోత మోగిస్తున్న విద్యుత్తు చార్జీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన విద్యుత్తు అందించడం చేతకాని ప్రభుత్వానికి చార్జీలు పెంచే అర్హత లేదు. ప్రజలపై భారాన్ని మోపే ప్రభుత్వం జనాగ్రహానికి గురికాక తప్పదు.
- అజ్మీరు వీరభద్రయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు, వత్సవాయి
గుండె గుభేల్
విద్యుత్ బిల్లులను చూస్తేనే గుండె గుభేల్‌మంటోంది. విద్యుత్తు బిల్లుల పెరుగుదల వల్ల నెలవారీ ప్రణాళిక కుదరటం లేదు. ప్రతి నెలా కరెంటు బిల్లు వస్తుందంటే భయం వేస్తోంది. వాడకానికి, వచ్చే బిల్లులకు పొంతన ఉండటం లేదు. ఈ పరిస్థితిలో మళ్లీ చార్జీలు పెంచటం దారుణం. విద్యుత్తు చార్జీల పెంపుదల వల్ల మధ్యతరగతి ప్రజలు నానాయాతన పడుతున్నారు.
- ఎన్ అనూష, మధురానగర్, విజయవాడ
అన్యాయం
ఓ పక్క విద్యుత్తు సరఫరా పరిస్థితి ఘోరంగా ఉంది. నాణ్యమైన విద్యుత్తు అందించలేని సర్కారు బిల్లుల మోత మోగించడం అన్యాయం. అడ్డగోలుగా పెంచిన కరెంటు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- పెదపూడి సత్యనారాయణ, మధురానగర్, విజయవాడ

No comments:
Post a Comment