అచ్చం నాన్నలా..

ఆ మాట, ఆ హావభావం మహానేత రాజన్నను కళ్లకు కడుతోంది.. ఆ పట్టుదల, ఆ సంకల్ప దీక్ష జననేత జగనన్నను తలపిస్తోంది.. ఎండ మండుతున్నా.. వడగాడ్పులు వీస్తున్నా..తరగని ఉత్సాహం, చెదరని ఉద్వేగంతో దీక్షాదక్షురాలై షర్మిల ముందుకు సాగుతోంది. కిరణ్ సర్కార్ కిరాతక చర్యకు సాగునీరందక బీడువడిన నేలమ్మను చూసి ఆమె కళ్లు చెమర్చాయి. ఆ పొలాల్లోనే బసచేసి.. ‘జగనన్న వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు.. నీ గుండెల్లో జలధారలు నింపి సిరులు పొంగిస్తాడ’ంటూ ఆమె ఓదార్చింది.

                                                                                 ముదినేపల్లి/గుడ్లవల్లేరు : భానుడి భగభగలు, వడగాడ్పులు ఆమె సంకల్పాన్ని అడ్డగించలేకపోయాయి. మండుటెండను సైతం లెక్కచేయక అలుపెరుగని బాటసారిగా ముందుకు సాగుతున్న షర్మిలను చూసి ప్రతి ఒక్కరూ మహానేత వైఎస్‌ను గుర్తు తెచ్చుకున్నారు. 

సాగులేక వట్టిపోయిన డెల్టా భూముల్లో అడుగులు వేస్తూ తీవ్ర వేదనకు గురైన ఆమె తీరు ఆ రైతు బాంధవుడ్ని కళ్లకు కట్టింది. బీడువడిన పొలాలకు నీరిచ్చి, ఎండుతున్న పల్లెకు ప్రాణంపోసిన ఆ మహనీయుని తనయ రాకతో ఊళ్లకు ఊళ్లే ప్రణమిల్లాయి. ‘జగనన్న త్వరలోనే వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ అన్నదాతలకు భరోసానిస్తూ ఆమె ‘మరో ప్రజాప్రస్థానం’ ముందుకు సాగింది. మోడువారిన నేలతల్లి ఒడిలోనే ఆమె శుక్రవారం బస చేసి తన పల్లె పక్షపాతాన్ని చాటారు. 

గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కూరాడ నుంచి కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం చినపాలపర్రు వరకు శుక్రవారం షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సాగింది. కూరాడ, విన్నకోట, సంఘర్షణపురం, పెనుమల్లి, సింగాపురం, గురజ, ముదినేపల్లి, చినపాలపర్రు గ్రామాల్లో పాదయాత్ర సాగింది. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా విన్నకోటలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సంఘర్షణపురంలో అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించారు. 

విన్నకోటలో రచ్చబండ నిర్వహించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. రాత్రి ముదినేపల్లిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, చిరంజీవిలపై అనేక అవినీతి, అక్రమార్జన ఆరోపణలు ఉన్నా సీబీఐ స్పందించడంలేదని, ప్రజల మనిషి జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధిస్తున్నారని ఆమె విమర్శించారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ చంద్రబాబును ప్రస్తావిస్తూ ‘మా దొంగల్లుడు సినిమా ఇక ఆడబోదు’ అని ఎద్దేవా చేశారు. ముదినేపల్లిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాతూరి సీతారామాంజనేయులు తొమ్మిది గ్రామాలకు చెందిన 800 మంది అనుచరులతో షర్మిల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పలు గ్రామాల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరారు. 

షర్మిలను కలసిన మాజీ ఎమ్మెల్యే రాజబాబు

కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజారామచందర్ (రాజబాబు) విన్నకోటలో షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ మరణంతోనే తన రాజకీయ జీవితం అంతమైపోయిందని, ఆయన తనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఎప్పటికీ మరువలేనని అన్నారు. వైఎస్ తనయ ఎండను సైతం లెక్కచేయక ప్రజలను కలుసుకునేందుకు, వారి కష్టాలు తెలుసుకునేందుకు సాహసవంతమైన పాదయాత్రను చేపట్టిందని అన్నారు. 

వెంట నడిచిన నేతలు

షర్మిల పాదయాత్రలో ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ పరిశీలకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), కైకలూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ దూలం నాగేశ్వరరావు, పెడన నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఉప్పాల రామ్‌ప్రసాద్, హైకోర్టు న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు, పోసిన చెంచురామారావు, మాజీ ఎమ్మెల్యేలు ముసునూరి రత్నబోస్, ఎర్నేని రాజారామచందర్, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేజండ్ల శివశంకరరావు,ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ గొల్ల వరప్రసాద్, అబ్దుల్ ఖాదర్, వడ్లమూడి నాని తదితరులు పాల్గొన్నారు
Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.