యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు.

యాజమాన్య కోటాపై ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు
2013-14 విద్యా సంవత్సరం నుంచి వర్తింపు
జీవో నంబర్ 66, 67 అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి ఆదేశం
వెబ్‌సైట్ ద్వారా కాలేజీకి దరఖాస్తు చేసుకునే అవకాశం.. ఆన్‌లైన్‌లోనే ఎంపిక జాబితా

 
ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఈమేరకు 2013-14 నుంచి అమలు చేయాలని సూచిస్తూ ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. గతేడాది తొలుత ఒక జీవో జారీ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చడంతో ఆన్‌లైన్ భర్తీ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. దీంతో ఉన్నత విద్యాశాఖ ఈసారి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ 3న విడుదల చేసిన జీవో 66, 67లను అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా లేఖలో పేర్కొన్నారు. 2012 ఆగస్టు 28న ప్రభుత్వం తొలుత విడుదల చేసిన 60, 61 జీవోలు బీ-కేటగిరీ సీట్ల భర్తీని పారదర్శకంగా నిర్వహించేలా లేవంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావటంతో సమీక్షించిన అనంతరం జీవో 66, 67లను జారీ చేసింది. ఆన్‌లైన్‌లో సీట్లను భర్తీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆ జీవోలు వెలువరించింది. అయితే తొలుత జారీ చేసిన జీవోల ఆధారంగా అప్పటికే భర్తీ ప్రక్రియ చేపట్టామని.. 66, 67 జీవోలను నిలిపివేయాలని పలు కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో 2012-13 విద్యా సంవత్సరంలో ఇవి వర్తించవని హైకోర్టు ఆదేశాలిచ్చింది. 

ఆన్‌లైన్‌లో కోటా సీట్ల భర్తీ ఇలా..

అర్హత కలిగిన అధికార యంత్రాంగం(ఉన్నత విద్యామండలి) బీ కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్ విండో తరహాలో ఒక వెబ్ పోర్టల్‌ను రూపొందిస్తుంది. ప్రతి కళాశాలకు ఒక యూజర్ నేమ్, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. డిజిటల్ సంతకం ద్వారా మాత్రమే కళాశాలలు పోర్టల్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలను కళాశాలలు పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలి.

ఈ సీట్ల భర్తీకి కాల వ్యవధిని ఉన్నత విద్యామండలి నిర్దేశిస్తుంది. ఈలోపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో కళాశాలలు ప్రకటనలు జారీ చేయాలి. అందుకు అనుగుణంగా విద్యార్థులు పోర్టల్ ద్వారా నచ్చిన కళాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

కోర్సుల ప్రాధాన్య క్రమాన్ని పేర్కొంటూ ఒక కళాశాలకు ఒకటి చొప్పున ఎన్ని కళాశాలలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిశాక దరఖాస్తుకు వీలుండదు. దరఖాస్తు చేసుకోగానే ఆ వివరాలు ఆన్‌లైన్‌లోనే కళాశాలలకు అందుతాయి. కళాశాలలు ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారు చేస్తాయి. 

ఎంపిక జాబితాను కళాశాలలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తాయి. ఈ ప్రతిభాక్రమం సరైనదేనని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్‌లైన్‌లోనే ఆమోదిస్తుంది. లేదంటే తిరస్కరిస్తుంది. కళాశాలలు ఆ జాబితాను పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతాయి. ఇంకా సీట్లు మిగిలితే రెండో మెరిట్ జాబితాను తయారు చేస్తారు. 
Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.