ఇందులో జూనియర్ ఎన్టీఆర్ స్థలం12 ఎకరాలు?
3/9/2013
మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలంలోని రెండు గ్రామాల్లో సుమారు రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన 12 ఎకరాలు కూడా ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై సందిగ్ధత ఉందని తహశీల్దార్ గీత చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. నాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 135లోని 19 ఎకరాల 11 గుంటలు, వెలిమల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 434/1లోని 25 ఎకరాల ఆక్రమిత భూములను తహశీల్దార్ నేతృత్వంలో సిబ్బంది స్వాధీన పర్చుకున్నారు. రెండు గ్రామాల పరిధిలోని మొత్తం 44 ఎకరాల 11 గుంటల భూమి విలువ రూ. 60 కోట్లు ఉంటుందని తహశీల్దార్ చెప్పారు. కొద్ది నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ నాగులపల్లిలోని సర్వే నంబర్ 135లో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఇలావుండగా వెలిమలలోని 25 ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లాకు చెందిన విక్రమ్‌రెడ్డి కబ్జాలో ఉందని, సర్వే అనంతరం దాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి స్వాధీన పర్చుకున్నామని వివరించారు.
|
No comments:
Post a Comment