ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్

నేను వైఎస్సార్ అభిమానిని మాత్రమే కాదు, జగన్ కోసం ప్రాణాలర్పించే తమ్ముణ్ని కూడా. జగన్ పేరు వినగానే అమ్మమ్మ, తాతయ్యల మొహంలో చిరునవ్వు, తల్లిదండ్రుల్లో ‘మా కొడుకు’ అన్న భావన, అన్నదమ్ములకు మరో తోబుట్టువు అన్న ధైర్యం వెల్లివిరుస్తాయి. అలాంటిది ఏ తప్పూ చేయని జగనన్నను జైలుపాలు చేయడం ఈ దుష్ట, నీచ రాజకీయ పరిపాలనకు నిదర్శనం. 
ఈ ప్రభుత్వానికి ఒక విషయం అర్థం కావటం లేదు, మేం ఓట్లేసి గెలిపించింది సోనియాను చూసి కాదు, మా వైఎస్సార్‌ను చూసి అని. ఆ మహానుభావుడు రాష్ట్ర ప్రజలకు చేసిన పనులు చూసి. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108, ఉచిత విద్యుత్తు... ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికీ నేనున్నాననే ధైర్యాన్ని నూరిపోశాడు. ఆయన చనిపోయాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో అని కుంగిన సమయంలో ‘నేనున్నాను’ అంటూ మమ్మల్ని ఓదార్చి మాకు అండగా ఉన్న మా జగనన్నను జైల్లో పెట్టారు. ఇంకా ఈ ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు ఏమి చేయాలనుకుంటున్నారు?! వైఎస్సార్‌ని దోషిని చేశారు. జగనన్నని జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. 

అసలు జగనన్న చేసిన తప్పేమిటి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేయటమా? విద్యార్థుల కోసం ఫీజు దీక్ష చేయటమా? రైతన్నల కోసం రైతు దీక్ష చేయటమా? కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టడమా? చనిపోయినవారి కుటుంబ సభ్యుల కన్నీరు తుడవడమా? ఏం నేరం చేశాడని జైల్లో పెట్టారు? ఇవేవీ కావు. జగనన్న ఓ ప్రజానాయకుడు. ప్రజలు మెచ్చి, కోరుకునే నిజమైన నాయకుడు. జగన్ ‘పేదల పెన్నిధి’. కోర్టు వారికి నా మనవి: అయ్యా! నిస్వార్ధంగా సేవచేసే మా జగనన్నకి వెంటనే బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుకుంటున్నాం. జగన్‌ను విడుదల చేయండి. మంచిని కాపాడండి


ఆత్మీయస్పర్శను దూరం చేశారు 

డైనమిజమ్, కమిట్‌మెంట్ కలిగిన నాయకుడు వై.ఎస్. జగన్. నిర్ణయం తీసుకుంటే, ఎంతటి కష్టమొచ్చినా నష్టమొచ్చినా తట్టుకోగలిగే గుండె దిటవు కలవాడు. ఆశ్రీతులను ఆదుకోవడంలో తండ్రికి తగ్గ తనయుడు. రాజకీయ నాయకుడైతే తక్షణావసరాల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడయితే, భావితరాల గురించి కూడా ఆలోచించి, ప్రజలకు ఏది మంచో అది చేస్తాడు. అటువంటి రాజనీతిజ్ఞుడు జగన్‌బాబు. అటువంటి దృఢ సంకల్పం గల జగన్‌కు, ఈ ఆంక్షలు, అరెస్టులు అడ్డుకావు. కాలేవు. చిన్నతనంలోనే సమర్థ నాయకత్వం వహించి, ప్రజల కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలతో నేరుగా సంబంధబాంధవ్యాలు ఏర్పర్చుకుని వారి ఈతి బాధలు అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు జగన్ ఒక్కరే. 

ఇంకా ఓదార్చవలసిన కుటుంబాలు మిగిలి ఉండగానే సగంలో ఆయన ఆత్మీయ స్పర్శను ప్రజల నుంచి ఈ ప్రభుత్వం లాగేసుకుంది. ఏ సంఘటనలోనైనా సానుకూల దృక్పథంతో చూడాలన్నది ఆర్యోక్తి. ఏది జరిగినా దానివల్ల జగన్‌కి, తద్వారా ప్రజలకి భవిష్యత్తులో మేలు జరుగుతుంది. విజయమ్మ, భారతి, షర్మిల గార్లు ధైర్యంగా ఉండవలసినదిగా మనవి. కలత చెందకండి. పరిస్థితులన్నీ చక్కబడతాయి. దైవ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కష్టాలు తాత్కాలికం. దైవం, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ జగన్‌కి ఉంటాయి. అవే ఆయనను కాపాడుతాయి. ఆయనకు విజయం చేకూరుస్తాయి
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.