• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

సబ్సిడీలను ఎత్తివేసేందుకే...!

* మరోప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
* నాడు కేంద్రం గ్యాస్ ధర పెంచితే వైఎస్ తన మీద వేసుకున్నారు
* మహిళలకు వంటింటి భారం తగ్గించారు
* ఈనాటి పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు
* ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు కన్నీళ్లే!
* అవిశ్వాసంతో ప్రభుత్వాన్ని దింపేయకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారు
* వెయ్యి కి.మీ. పూర్తి చేసుకున్న మరో ప్రజా ప్రస్థానం

మరో ప్రజాప్రస్థానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేయాలనుకున్నారు. మహిళా సాధికారత కోసం పరితపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచితే.. ఆ భారం నా అక్కాచెల్లెమ్మల మీద పడొద్దని వైఎస్సార్ తన మీద భారం వేసుకున్నారు. మహిళలకు వంటింటి భారాన్ని తగ్గించారు. ఇప్పుడున్న పాలకులు సబ్సిడీ గ్యాస్ నుంచి తప్పించుకోవడానికే సిలిండర్‌ను ఆధార్‌తో ముడిపెడుతున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని, త్వరలోనే ఈ కష్టాలు కడతేరే రోజు వస్తుందని హామీనిచ్చారు. 

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. సరిగ్గా దామరచర్ల మండలం కొండ్రపోలు కాల్వ వద్దకు చేరుకోవడంతో షర్మిల పాదయాత్ర 1000 కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. అంతకుముందు ఆమె గూడూరులో గ్రామస్తులతో కలిసి రచ్చబండలో పాల్గొన్నారు. 

‘‘వైఎస్సార్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కపూట భోజనం కూడా సరిగ్గా తినలేకపోతున్నాం.. గ్యాస్ ధర.. బియ్యం, పప్పు.. ప్రతి వస్తువు ధర పెరిగింది. మా లాంటి పేదోళ్లకు కనీసం ఒక్కపూట భోజనం పెట్టడం కోసమైనా జగనన్న బయటికి రావాలి’’ అని మానస అనే మహిళ అన్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. వైఎస్ మహిళల సంక్షేమం కోసం క్షణక్షణం తపించారన్నారు. నేటి పాలకులకు ఆ చిత్తశుద్ధి కరువైందని మండిపడ్డారు. తర్వాత కొండ్రపోలు కాల్వ వద్ద పార్టీ నాయకులు, అభిమానుల కోరిక మేరకు షర్మిల కొద్దిసేపు ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

పాదయాత్ర రికార్డుల కోసం కాదు..
రికార్డుల కోసం పాదయాత్ర చేయడం లేదు.. పండుగలు చేసుకోవడం కోసం కాదు. వైఎస్సార్ పాదయాత్రను మహాయజ్ఞంలా చేశారు. దేవుడి దయ, నాన్నగారి ఆశీస్సులతో జగనన్న తరపున చేస్తున్న ఈ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మూడున్నర సంవత్సరాల కిందట వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచే రాష్ట్రం అతలాకుతలమైంది. పోయింది ఒక్క మనిషే కానీ రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు కోలుకోలేదు.

ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది
పాదయాత్ర చేస్తూ ఏ గ్రామానికి వెళ్లినా కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా అప్పుల బాధలే. అన్ని బాధల్లోనూ ప్రజలు వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అమ్మా.. నాయిన బతికున్నప్పుడు చాలా బాగుండేదమ్మా.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే వారే లేరమ్మా’ అని చెప్తున్నారు. జగనన్న మన మధ్య లేరని బాధపడేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఒక్కమాట మటుకు ఆత్మ విశ్వాసంతో చెప్తున్నా.. ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది. 

జగనన్న బయటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరు. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం దిశగా మనలను నడిపిస్తారు. ఎన్ని కుట్రలు పన్నేవాళ్లు ఉన్నా.. దేవుని దయ, నాన్నగారి ఆశీస్సులు... మీ ప్రేమానురాగాలతో జగనన్న ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చేటట్టు చేస్తారు. ఇంత దూరం.. ఇన్ని జిల్లాల్లో.. ఇన్ని గ్రామాల్లో.. ఇంతమంది ప్రజలు, నాయకులు మాకు ఎంతో సహాయం చేసి పాదయాత్రను జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 

బాబు ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు
చంద్రబాబు గారు.. పాదయాత్రల పేరుతో పల్లెల చుట్టూ తిరుగుతూ డ్రామాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల కన్నీళ్లు.. కష్టాలు పట్టవు. పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. అవసరం వస్తే అవిశ్వాసం పెడతానంటూ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఆయనకు ప్రజల మీద కంటే కుర్చీ మీదే ఆయనకు ప్రేమ ఎక్కువ. అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఆయన అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని వెంటనే దించేయవచ్చు. కానీ ఆ పని చేయరు. అయితే దానికో లెక్కుంది.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

సోమవారం 70వ రోజు పాదయాత్ర ఎదులగూడెం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గూడూరు, కిష్టాపురం, కొత్తగూడెం, కొండ్రపోలు గ్రామాల మీదుగా సాగింది. కొండ్రపోలు నుంచి 0.7 కిలోమీటర్లు నడిచి కొండ్రపోలు కాల్వకు చేరుకోవడంతోనే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయినట్లు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. అబద్ధపు కేసులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాలుగు గోడల మధ్య బంధించటాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. 

కొండ్రపోలు కాల్వ నుంచి మరో 4.5 కిలోమీటర్లు నడిచి దామరచర్ల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 13.3 కి.మీ. నడిచారు. ఇప్పటిదాకా 1004.5 కి.మీ. యాత్ర పూర్తయింది. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, తలశిల రఘురాం, గాదె నిరంజన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, స్పురధర్‌రెడ్డి, శ్రీకళారెడ్డి, ఎర్నేని బాబు, బోయపల్లి అనంతకుమార్, సిరాజ్‌ఖాన్, ఎండీ సలీం, ఇరుగు సునీల్‌కుమార్, కేఎల్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

షర్మిల రక్తదానం
పాదయాత్ర బడలికను పక్కనబెట్టి షర్మిల రక్తదానం చేశారు. మరో ప్రజాప్రస్థానం 1,000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు రెడ్‌క్రాస్ సంస్థకు రక్తదానం చేశారు. పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో సాగిన ఈ శిబిరంలో షర్మిల స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. దాదాపు 400 మిల్లీలీటర్ల రక్తమిచ్చారు. ఆమె స్పూర్తితో దాదాపు 65 మంది రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన తర్వాత షర్మిల 4.5 కి.మీ. నడిచారు.

మహిళలకు చీరల పంపిణీ..
షర్మిల 1,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదానం అనంతరం షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్ విగ్రహం వద్దే ఇళ్లు కట్టుకుంటా: సూర్యానాయక్
‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు రైతుల ముఖంలో నవ్వుండేది. ఇప్పుడది లేదు. షర్మిల పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు మా భూమి దగ్గరే పూర్తి కావడం మా అదృష్టం. మా కొడుకు ఒకరు పైలట్. మరో కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చదువు పూర్తయ్యాక కొడుకు అమెరికా వెళ్లినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడూ అంతే సంతోషం వేస్తోంది. వైఎస్సార్ విగ్ర హం వెనకాలే ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు వైఎస్సార్ నా  ఇంటి ముందే ఉంటాడు’’ అని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు కోసం తన భూమిని దానంగా ఇచ్చిన గిరిజన రైతు సూర్యానాయక్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు భూమిని దానం చేసిన సూర్యానాయక్ దంపతులకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు
Share:

ఎట్టకేలకు స్థానిక ఎన్నికల నగారా

* ఓటమి భయంతో రెండేళ్లుగా వాయిదా వేసిన సర్కారు
* ఇప్పుడు ‘పార్టీరహితం’ మాటున గండం గట్టెక్కే ఎత్తుగడ
* పరువు నిలుపుకునే వ్యూహాలకు ఇప్పటినుంచే పదును

ఎట్టకేలకు స్థానిక ఎన్నికల నగారా మోగింది.
ఓటమి భయంతో నానా సాకులతో రెండేళ్లుగా ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న రాష్ట్ర సర్కారు ఎత్తుగడలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. పంచాయతీరాజ్ సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సోమవారం ఆదేశించింది. 2001 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని, 60.55 రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని, వెనకబాటుతనంపై మూడు నెలల్లో అధ్యయనం పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. 2006లో నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. భవిష్యత్తులో స్థానిక రిజర్వేషన్లు ఎలా ఉండాలన్న అంశంపై మరోమారు విచారించి నిర్ణయిస్తామని తెలిపింది. సుప్రీం తీర్పుతో అధికార కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. 

అత్యంత తక్కువ ఓట్లతో జరిగిన సహకార ఎన్నికలను అటు అధికార, ధన బలాలు, విపక్ష టీడీపీ సహకారంతో ఎలాగోలా గట్టెక్కినా.. స్థానిక ఎన్నికల్లో మాత్రం ప్రజాగ్రహం తమ పుట్టి ముంచడం ఖాయమని ఆందోళన చెందుతోంది. ఎన్నికలు జరిగితే క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీలు బలోపేతమవుతాయనే భయంతోనే రెండేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నామన్నది బహిరంగ రహస్యమేనని అధికార పార్టీ నేతలే అంటున్నారు!  ముందు పార్టీరహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం గండం గట్టెక్కజూస్తోంది
Share:

ముందు పంచాయితీ ఎన్నికలు!

ఆ తర్వాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు!
ముందుగా కాల పరిమితి ముగిసింది మండల, జిల్లా పరిషత్‌లకే
అయినా తొలుత పంచాయతీ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి
ఎవరు గెలిచినా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకోవచ్చనే ఈ ఎత్తుగడ
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60.55 శాతం రిజర్వేషన్లు అమలు
అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్
జూన్, జూలై నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం!

సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ప్రభుత్వం ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు రాష్ట్రంలో మొదటి నుంచీ పార్టీ రహితంగానే జరుగుతున్నాయి. పార్టీ రహిత ఎన్నికల వల్ల ఎవరు గెలిచినా అధికార పార్టీ తన ఖాతాలోనే జమ చేసుకునే అవకాశం ఉన్నందున ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఇంతకుముందు జరిగిన మూడు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 60.55 శాతం (బీసీ 34%, ఎస్సీ 18.30%, ఎస్టీ 8.25%) అమలయ్యాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఈ రిజర్వేషన్లతోనే ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. 2011లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించలేదు. రిజర్వేషన్ల సైకిల్ 2006తో (1995, 2001, 2006) ముగిసింది. దీంతో మళ్లీ రిజర్వేషన్ సైకిల్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు జిల్లాలవారీగా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇది పూర్తి చేసి జూన్, జూలై నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశముంది.

రాష్ట్రంలో 21,750 గ్రామ పంచాయతీలు, దాదాపు 16 వేల ఎంపీటీసీ స్థానాలు, 1,097 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణంగా రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. 2011లో కూడా మండల, జిల్లా పరిషత్‌ల కాల పరిమితే ముందుగా ముగిసింది. ఆ ఏడాది జూలైలో వీటి కాలపరిమితి ముగియగా, ఆగస్టులో పంచాయతీల కాలపరిమితి ముగిసింది. 2011లో మండల, జెడ్పీ ఎన్నికలకు ప్రభుత్వం రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీచేసింది. వీటిపై హైకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం మాత్రం ముందుగా పంచాయతీ ఎన్నికలు జరపాలని భావిస్తోంది. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుని మెజారిటీ పంచాయతీలు తామే గెలిచామని చెప్పుకోవచ్చు. సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి పంచాయతీరాజ్ కమిషనర్ రాంగోపాల్‌తో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీలకూ పార్టీ రహిత ఎన్నికలే!
పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రస్తుతమున్న విధానంలో మార్పులు చేసుకొనే వీలుందని సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. సీఎంతో మంత్రులు, అధకారుల సమావేశం తరువాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మారిపోనున్న రిజర్వేషన్లు
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ముఖచిత్రం మారిపోనుంది. మేజర్ పంచాయతీలు, వాటికి అనుబంధంగా ఉన్న పలు గ్రామాలను మునిసిపాలిటీలుగా మార్చడంతో రిజర్వేషన్లలోనూ మార్పులు వస్తాయి. 130పైకి పైగా పంచాయతీలు మునిసిపాలిటీల పరిధిలోకి వెళ్లడంతో ఎంపీటీసీల డీలిమిటేషన్ జరగనుంది. ఈ పంచాయతీల్లో ఉండే జనాభా పట్టణ ప్రాంతాల పరిధిలోకి రావడంతో, పంచాయతీల్లో జనాభా తగ్గిపోతుంది. దీని ప్రభావం జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రిజర్వేషన్ల పైన కూడా పడుతుంది. రాష్ట్రం యూనిట్‌గా మండల, జిల్లా పరిషత్, జెడ్పీటీసీ రిజర్వేషన్లు అమలు చేయడంవల్ల ఈ మార్పు తప్పదు. 2001 జనాభా లెక్కల ఆధారంగానే పంచాయతీరాజ్ అధికారులు డీలిమిటేషన్, రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
Share:

స్వాధీనం చేసుకుంది టీడీపీ హయాంలోనే


స్వాధీనం చేసుకుంది టీడీపీ హయాంలోనే 
బ్రదర్‌పై విమర్శలు సమస్యను పక్కదారి పట్టించేందుకే
పొలిటికల్ స్టంట్‌పై మండిపడుతున్న స్థానికులు
పోకల్‌వాడ భూముల కోసం ఆందోళనకు సన్నాహాలు 

‘‘అనాదిగా మేం సాగుచేసుకుంటున్న భూములను 1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్కుని మమ్మల్ని దిక్కులేని వారిని చేసింది. న్యాయం చేయమని కోరిన పాపానికి పోలీసు కేసులు పెట్టించి వేధించింది. పేదలను ఆదుకోవాల్సిన సర్కారే ఉన్న ఆధారాన్ని కూడా ఊడ్చేసింది. మేం ఎవరికి చెప్పుకోవాలి ? ఇక మాకు దిక్కెవరు..?’’ అంటూ మణికొండ భూ భాధితులు వాపోతున్నారు. మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేష్ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికైనా సర్కార్ తమకు న్యాయం చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించా రు. ఈ సందర్భంగా యాలాల నరేష్ మాట్లాడుతూ... రాజేంద్రనగర్ మండలం మణికొండ పరిధిలోని పోకల్‌వాడలో సర్వే నం.4లో సుమారు 54 ఎకరాల ప్రభుత్వ భూమిలో పోకల్‌వాడ గ్రామానికి చెందిన 18 మంది దళితులతో పాటు రాయదుర్గం, షేక్‌పేట్‌కు చెందిన 29 మంది పేదలు సాగుచే సుకొంటూ జీవనం సాగించారని చెప్పారు. 

అయితే 1986లో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని నోటిఫై చేసి, బలవంతంగా స్వాధీనం చేసుకుని హుడా పరిధిలోకి తెచ్చిందని తెలిపారు. ‘‘మొత్తం భూమిలో ఏడెకరాలు నిరుపేదలకు ఇంటిస్థలాల కోసం కేటాయించగా, మరో 30 ఎకరాలను అప్పటి హుడాకు అప్పగించింది. దీంతో వారు లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ఇదే భూమిలో 8 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించగా, మరో నాలుగు ఎకరాలు జీసస్ నజ్రత్ మినిస్ట్రీస్ సంస్థకు 2006లో 33 ఏళ్ల పాటు లీజుకిచ్చింది’’ అని వివరించారు. వాస్తవాలిలా ఉండగా... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ దళితులనుంచి భూములు లాక్కుని కబ్జాచేసి అక్రమంగా చర్చి నిర్మించారని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపించడం సమస్యను పక్కదోవ పట్టించేందుకేనని ఆయన దుయ్యబట్టారు. తమను బలిపశువుల్ని చేసి మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంటూ బాధితులు మండిపడ్డారు.

దొంగ కేసులు పెట్టారు
దిమ్మలు కూలగొట్టారని మాపై దొంగకేసులు పెట్టారు. అన్యాయంగా కేసులు బనాయించారని కోర్టు కూడా మా వైపే తీర్పు చెప్పింది. పోలీసుల్ని పెట్టించి మరీ ఎన్టీఆర్ మా భూముల్ని హుడాకు ఇచ్చారు. ఇది అన్యాయం అని పోరాడిన వాళ్లందరూ చనిపోయారు. నేను ఒక్కడ్నే బతికున్నా.
- లింగమయ్య, స్థానికుడు

మా భర్తలను పోలీస్ స్టేషన్‌లో వేశారు
1986లో ఎన్టీఆర్ హయాంలో మా భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు. అదేమిటని అడ్డుపడిన మా భర్తలను పోలీస్ స్టేషన్‌లో వేశారు. సరే కనీసం భూమి తీసుకొని క్వార్టర్స్ ఇస్తారు అనుకున్నాం. కానీ ఇవ్వలేదు. న్యాయం కోసం ఎంతమందిని కలిసినా లాభం లేకుండా పోయింది.
-భారతమ్మ, స్థానికురాలు

సతాయిస్తున్నారు 
పోలీసుల చేత మమ్మల్ని చితక్కొట్టించి మరీ మా భూముల్ని లాక్కున్నారు. మీరైనా కాపాడండి అని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చాలాసార్లు కలిశాం. ఇస్తాం చేస్తాం అని తిప్పించుకుంటుంది తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదు.
-వీరమ్మ, స్థానికురాలు

పచ్చని పొలాల్ని లాక్కున్నారు..
జొన్నలు, వరి పండించే వాళ్లం. పచ్చని పొలాల్ని పోలీసులను పెట్టించి మరీ ఎన్టీఆర్ హయాంలో లాక్కొని హుడాకు ఇచ్చారు. అడ్డొచ్చిన మా భర్తల్ని దర్గా టౌన్, నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లలో వేశారు. నా భర్త చనిపోయాడు. ఇప్పటివరకూ న్యాయం చేయలేదు. పొలం లేదు. ఇల్లు లేదు అన్నీ పోయాయి. 
-జంగమ్మ, స్థానికులు.
Share:

కుట్రలు, కుమ్మక్కుల ‘సహకారం’

ముగిసిన సహకార డెరైక్టర్ల ఎన్నికల ప్రహసనం 
తారస్థాయిలో అధికార దుర్వినియోగం
గుప్పెడు డీసీసీబీలు.. గంపెడు అపకీర్తి
ఫలితాలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం
యథాప్రకారం కాంగ్రెస్‌తో టీడీపీ చెట్టపట్టాలు

సాక్షి, హైదరాబాద్:ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచే మొదలైన అధికారిక కుట్రలు, ప్రతిపక్ష కుమ్మక్కులతో మెజారిటీ జిల్లా సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల అధ్యక్ష పీఠాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. ఈ ‘సహకార’ ఎన్నికలు అధికార దుర్వినియోగానికి, కుట్రలకు, కుంతంత్రాలకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ దివాళాకోరు కుమ్మక్కులకు ప్రతీకగా రాష్ట్ర చరిత్రలో కలకాలం నిలిచిపోతాయి. ఎలాగైనా రాష్ట్రంలో మూడో రాజకీయ పార్టీ వేళ్లూనుకోకూడదన్న ఏకైక ధ్యేయంతో కాంగ్రెస్, టీడీపీ పాల్పడ్డ నిస్సిగ్గు కుమ్మక్కు రాజకీయాల పర్యవసానంగా వైఎస్సార్, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ తన మద్దతుదారులను డెరైక్టర్లుగా గెలిపించుకోగలిగింది. 

తద్వారా గుప్పెడు డీసీసీబీలను చేజిక్కించుకున్నా, గంపెడు అపకీర్తిని కూడా ఈ ఎన్నికల ద్వారా పార్టీ మూటగట్టుకుందన్న వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కడప జిల్లా ప్రజలు మాత్రం అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే గెలిపించుకున్నారు. కడపలోనైతే స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ఫోన్ చేసి మరీ పోటీలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థిని కాంగ్రెస్‌కు అనుకూలంగా పోటీ నుంచి ఉపసంహరింపజేసినా ఫలితం దక్కలే దు. ఇక విశాఖలో 15 మంది టీడీపీ అభ్యర్థుల్లో ఏకం గా 14 మంది కాంగ్రెస్ మద్దతుదారులకు ఓట్లేశారు!

కుట్రలను భగ్నంచేసిన కడప
కడప జిల్లాలో 77 ప్రాథమిక సహకార సంఘాలుండగా కేవలం 54 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. వాటిలోనూ ‘డిఫాల్ట్’ కింద 18 సంఘాలను ఎన్నికలకు దూరం చేశారు. ఇలా అడుగడుగునా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల గెలుపును దెబ్బ తీసేందుకు ప్రయత్నించినా చివరకు 36 మందిలో కూడా మెజారిటీ సభ్యులు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులే గెలుపొందారు. డీసీసీబీ ఎన్నికల్లో బీ-గ్రూపు ఓటర్ల కోసం అధికార పార్టీ నేతలు ఎంతగా వెంపర్లాడినా అందులోనూ పై చేయి సాధించలేకపోయారు. దాంతో కొందరు సభ్యులను కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. ఇదే సమయంలో డీసీసీబీ డెరైక్టర్ స్థానానికి జిల్లా టీడీపీ నేత రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి సోదరుడు నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా పక్కకు తప్పుకోవాల్సిందిగా జిల్లా టీడీపీ నేతలు సూచించినా ఆయన వినకపోవడంతో బాబే నేరుగా ‘లైన్’లోకి వచ్చి మరీ ఆయనను విరమింపజేశారు. ఇన్ని కుట్రలకు తోడు, సోమవారం ఎన్నికల రోజు కూడా పోలీసుల అండతో భయోత్పాతాన్ని సృష్టించేందుకు వీరశివారెడ్డి ప్రయత్నించారు. ఈ అధికార, ప్రతిపక్ష కుట్రలన్నింటినీ భగ్నం చేస్తూ 14 స్థానాలకు గాను ఎనిమిదింటిని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.

సిగ్గుచేటుగా చిత్తూరు రాజకీయం: ఇక ముఖ్యమంత్రి కిరణ్, విపక్ష నేత చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరు రాజకీయం మరింత సిగ్గుచేటుగా సాగింది. జిల్లాలో కాంగ్రెస్‌కు దీటుగా బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో పలువురిని నామినేషన్ వేయకుండా నానారకాలుగా అడ్డుకున్నారు. డీసీసీబీ స్థానం కాంగ్రెస్‌కు ఏకగ్రీవమయ్యేలా విపక్ష టీడీపీ సహకరించింది. అందుకు ప్రతిగా డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులెవరూ నామినేషన్ వేయకుండా, ఆ స్థానం టీడీపీకి దక్కేలా చేశారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధికారికంగా ప్రకటించినప్పటికీ డీసీఎంఎస్‌లో ఆ పార్టీ మద్దతుదారులే గెలవడం కుమ్మక్కుకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ప్రింటింగ్ ప్రెస్ సహకార ఎన్నికల్లో ఐదు డెరైక్టర్ స్థానాలతో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. ఇక కర్నూలు ఎన్నికంతా ఏకపక్షంగానే జరిగిపోయిం ది. డీసీసీబీ కాంగ్రెస్‌కు ఏకగ్రీవం కాగా, డీసీఎంఎస్ లో టీడీపీ నాలుగు డెరైక్టర్ స్థానాలను దక్కించుకుంది. 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది
Share:

విద్యుత్ చార్జీల పెంపు 116 శాతం! ఈఆర్‌సీకి సర్కారు ప్రతిపాదనలు

* టారిఫ్ పెంపు, టెలిస్కోపిక్ విధానం ఎత్తివేతతో పెనుభారం
* వినియోగదారుల్లో మెజారిటీ తక్కువ విద్యుత్
* ఉపయోగించే పేద, మధ్యతరగతి వర్గాలే
* ధనికవర్గాలకు కేవలం 37 శాతమే పెరుగుదలపై విస్మయం
* శాస్త్రీయత లోపించిందంటున్న నిపుణులు
* 2013-14 విద్యుత్ చార్జీలపై నేటి నుంచి విచారణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగించే వర్గాలైనప్పటికీ.. ఎక్కువసంఖ్యలో ఉండే వీరిపై పెనుభారం మోపడం ద్వారా ఆశించిన మేరకు రాబట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నెలకు 300 యూనిట్లలోపు వినియోగించే పేద, మధ్యతరగతి వర్గాలకు ఏకంగా 116 శాతానికి పైగా విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. 500 యూనిట్లకుపైగా వినియోగించే తక్కువ ‘పెద్దలకు’ మాత్రం కేవలం 37% మాత్రమే చార్జీల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. 

2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏప్రిల్ 1 నుంచి ఏకంగా రూ.12,723 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై మంగళవారం నుంచి బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. పేదలపై భారం మోపే ఈ ప్రతిపాదనలను తిరస్కరించాలని విద్యుత్‌రంగ నిపుణులు ఈఆర్‌సీని కోరుతున్నారు. 

ఇటు పెంపు.. అటు టెలిస్కోపిక్ విధానం ఎత్తివేత
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు హేతుబద్ధంగా లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టారిఫ్ పెంపు, కొత్త ప్రతిపాదనల్లో భాగంగా గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై ఎక్కువ భారం పడుతోంది. ప్రస్తుతం 101 యూనిట్లు వినియోగించే వారికి నెల బిల్లు రూ.263.60 వస్తుండగా, తాజా పెంపుదల వల్ల (యూనిట్‌కు రూ.5.65 చొప్పున) రూ.570.65 రానుంది. అంటే ఏకంగా 116.48% మేరకు విద్యుత్ చార్జీలు పెరగనున్నాయన్నమాట.


                     
అయితే నెలకు 501 యూనిట్లు వినియోగించే ధనికవర్గాలకు మాత్రం ప్రస్తుత బిల్లు రూ.2,552.25 వస్తుండగా, తాజా పెంపు ప్రతిపాదనల వల్ల రూ.3,507 రానుంది. అంటే వీరికి పెరుగుదల శాతం కేవలం 37.42% మాత్రమేనన్నమాట. వాస్తవానికి 200 యూనిట్లలోపు కేటగిరీలోని వినియోగదారుల విద్యుత్ వాడకం రోజురోజుకీ తగ్గుతోంది. 2011-12తో పోలిస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వీరి విద్యుత్ వినియోగం సుమారు 15% వరకూ తగ్గింది. ఇందుకు కారణం భారీగా విద్యుత్ కోతలు అమలు జరుగుతుండడమే. 

ఈ కేటగిరీలోని పేద, మధ్యతరగతి వినియోగదారులు ప్రధానంగా గ్రామీణ, మండల కేంద్రాల్లో నివసిస్తున్నవారే. గ్రామీణ, మండల కేంద్రాల్లో భారీగా విద్యుత్ కోతలు అమలు జరుగుతున్నాయి. ఫలితంగా వీరి వాడకం తగ్గుతోంది. ఇక 500 యూనిట్లపైన వాడకందార్ల వినియోగం మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. తద్వారా వీరి అవసరాలను తీర్చేందుకే మార్కెట్లో ఏకంగా 5-6 రూపాయలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. సంబంధిత విద్యుత్ కొనుగోలు భారాన్ని వీరిపై వేయడమే సమంజసం. అలాకాకుండా పేద, మధ్యతరగతి ప్రజలపై వేయడం సరికాదని విద్యుత్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

పెద్దలకే పెంచాలి: టీజాక్ కో-ఆర్డినేటర్ రఘు
విద్యుత్‌ను దుబారాగా వినియోగిస్తున్న పెద్దలకు మాత్రమే చార్జీలను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చార్జీలను ఈఆర్‌సీకి సూచిస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (టీజాక్) కో-ఆర్డినేటర్ రఘు ‘సాక్షి’కి తెలిపారు. ‘300 యూనిట్ల వరకు టెలిస్కోపిక్ విధానాన్ని ఉంచాలి. 500 యూనిట్లకుపైగా వినియోగించే వారికి టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయాలి. అదేవిధంగా ఈ కేటగిరీ వినియోగదారులకే చార్జీలను పెంచాలి. తద్వారా అధిక విద్యుత్ వాడకందార్లను నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల అదనపు విద్యుత్ కొనుగోలు భారం కూడా తగ్గుతుంది’ అని ఆయన వివరించారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు జరిగే బహిరంగ విచారణలో ఈ విషయాన్ని ఈఆర్‌సీ దృష్టికి తేనున్నట్టు ఆయన చెప్పారు. 

టెలిస్కోపిక్ విధానం అంటే
ప్రస్తుతం గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ విద్యుత్ చార్జీల విధానం అమలవుతోంది. ఈ విధానంలో ఎంత విద్యుత్ వినియోగించినప్పటికీ శ్లాబు వారీగా యూనిట్ చార్జీలను వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు 201 యూనిట్లు వినియోగించాడనుకుంటే.. మొదటి 100 యూనిట్లకు రూ.2.60, 101-200 యూనిట్లకు రూ.3.60, 201వ యూనిట్‌కు రూ.5.75 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం ఎత్తివేయడం వల్ల ఎన్ని యూనిట్లు వినియోగిస్తే అన్ని యూనిట్లకూ (ప్రతి యూనిట్‌కు) ఆ శ్లాబుకు సంబంధించిన విద్యుత్ చార్జీని వసూలు చేస్తారు. నాన్-టెలిస్కోపిక్ విధానంలో నెలకు 201 యూనిట్లు వినియోగించిన వ్యక్తి నుంచి మొత్తం అన్ని యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.6.15 చొప్పున వసూలు చేస్తారన్నమాట. 

విచారణ ఎప్పుడు.. ఎక్కడ
కొత్త విద్యుత్ చార్జీలపై ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో విచారణ జరగనుంది. ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే విచారణ మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరగనుంది. భోజన విరామం అనంతరం తిరిగి రెండున్నర గంటల నుంచి 5 వరకూ జరుగుతుంది. 19న విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియం, 21న విశాఖపట్నం మహారాణి పేటలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం ఫంక్షన్ హాల్, 23న వరంగల్ జిల్లా ప్రజా పరిషత్‌హాల్ (హన్మకొండ), 25న హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సియా ఆడిటోరియంలో విచారణ జరగనుంది.

వచ్చే 3 నెలలూ నరకమే!
రానున్న మూడు నెలల్లో అనధికారికంగా భారీగా విద్యుత్ కోతలు అమలు చేయాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాలతో పాటు జంటనగరాల్లో కూడా భారీగా కోతలు తప్పవని అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో సీఎండీ హీరాలాల్ సమారియా నేతృత్వంలో అన్ని డిస్కంల సీఎండీల సమావేశం సోమవారం జరిగింది. ఈ భేటీలో భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్, సరఫరా, లోటు వివరాలను అంచనా వేశారు. మార్చి సగటు లోటు ఏకంగా 94 ఎంయూలకు చేరనుందని లెక్కగట్టారు. 

ఈ నేపథ్యంలో భారీ కోతలు అమలు చేయకతప్పదనే భావన వ్యక్తమైంది. వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ సరఫరా కూడా కష్టమనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఒక ఎకరం పంట కూడా ఎండకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సమారియా ఆదేశించారు. పరీక్షల వేళల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన, గాయపడ్డ వారికి నష్టపరిహారం పెంపుదలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
Share:

ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్

నేను వైఎస్సార్ అభిమానిని మాత్రమే కాదు, జగన్ కోసం ప్రాణాలర్పించే తమ్ముణ్ని కూడా. జగన్ పేరు వినగానే అమ్మమ్మ, తాతయ్యల మొహంలో చిరునవ్వు, తల్లిదండ్రుల్లో ‘మా కొడుకు’ అన్న భావన, అన్నదమ్ములకు మరో తోబుట్టువు అన్న ధైర్యం వెల్లివిరుస్తాయి. అలాంటిది ఏ తప్పూ చేయని జగనన్నను జైలుపాలు చేయడం ఈ దుష్ట, నీచ రాజకీయ పరిపాలనకు నిదర్శనం. 
ఈ ప్రభుత్వానికి ఒక విషయం అర్థం కావటం లేదు, మేం ఓట్లేసి గెలిపించింది సోనియాను చూసి కాదు, మా వైఎస్సార్‌ను చూసి అని. ఆ మహానుభావుడు రాష్ట్ర ప్రజలకు చేసిన పనులు చూసి. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108, ఉచిత విద్యుత్తు... ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికీ నేనున్నాననే ధైర్యాన్ని నూరిపోశాడు. ఆయన చనిపోయాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో అని కుంగిన సమయంలో ‘నేనున్నాను’ అంటూ మమ్మల్ని ఓదార్చి మాకు అండగా ఉన్న మా జగనన్నను జైల్లో పెట్టారు. ఇంకా ఈ ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు ఏమి చేయాలనుకుంటున్నారు?! వైఎస్సార్‌ని దోషిని చేశారు. జగనన్నని జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. 

అసలు జగనన్న చేసిన తప్పేమిటి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేయటమా? విద్యార్థుల కోసం ఫీజు దీక్ష చేయటమా? రైతన్నల కోసం రైతు దీక్ష చేయటమా? కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టడమా? చనిపోయినవారి కుటుంబ సభ్యుల కన్నీరు తుడవడమా? ఏం నేరం చేశాడని జైల్లో పెట్టారు? ఇవేవీ కావు. జగనన్న ఓ ప్రజానాయకుడు. ప్రజలు మెచ్చి, కోరుకునే నిజమైన నాయకుడు. జగన్ ‘పేదల పెన్నిధి’. కోర్టు వారికి నా మనవి: అయ్యా! నిస్వార్ధంగా సేవచేసే మా జగనన్నకి వెంటనే బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుకుంటున్నాం. జగన్‌ను విడుదల చేయండి. మంచిని కాపాడండి


ఆత్మీయస్పర్శను దూరం చేశారు 

డైనమిజమ్, కమిట్‌మెంట్ కలిగిన నాయకుడు వై.ఎస్. జగన్. నిర్ణయం తీసుకుంటే, ఎంతటి కష్టమొచ్చినా నష్టమొచ్చినా తట్టుకోగలిగే గుండె దిటవు కలవాడు. ఆశ్రీతులను ఆదుకోవడంలో తండ్రికి తగ్గ తనయుడు. రాజకీయ నాయకుడైతే తక్షణావసరాల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడయితే, భావితరాల గురించి కూడా ఆలోచించి, ప్రజలకు ఏది మంచో అది చేస్తాడు. అటువంటి రాజనీతిజ్ఞుడు జగన్‌బాబు. అటువంటి దృఢ సంకల్పం గల జగన్‌కు, ఈ ఆంక్షలు, అరెస్టులు అడ్డుకావు. కాలేవు. చిన్నతనంలోనే సమర్థ నాయకత్వం వహించి, ప్రజల కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలతో నేరుగా సంబంధబాంధవ్యాలు ఏర్పర్చుకుని వారి ఈతి బాధలు అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు జగన్ ఒక్కరే. 

ఇంకా ఓదార్చవలసిన కుటుంబాలు మిగిలి ఉండగానే సగంలో ఆయన ఆత్మీయ స్పర్శను ప్రజల నుంచి ఈ ప్రభుత్వం లాగేసుకుంది. ఏ సంఘటనలోనైనా సానుకూల దృక్పథంతో చూడాలన్నది ఆర్యోక్తి. ఏది జరిగినా దానివల్ల జగన్‌కి, తద్వారా ప్రజలకి భవిష్యత్తులో మేలు జరుగుతుంది. విజయమ్మ, భారతి, షర్మిల గార్లు ధైర్యంగా ఉండవలసినదిగా మనవి. కలత చెందకండి. పరిస్థితులన్నీ చక్కబడతాయి. దైవ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కష్టాలు తాత్కాలికం. దైవం, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ జగన్‌కి ఉంటాయి. అవే ఆయనను కాపాడుతాయి. ఆయనకు విజయం చేకూరుస్తాయి
Share:

మరో ప్రజాప్రస్థానానికి సన్నద్ధం..

గుంటూరు : మరో ప్రజాప్రస్థానానికి జిల్లా సన్నద్ధమైంది. పాలకుల నిర్లక్ష్యానికి గురై సమస్యల వలయంలో సతమతమవుతున్న ప్రజానీకానికి బాసటగా నిలవాలనే మహా సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా ఈ నెల 22 నుంచి గుంటూరు జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లాలో ముగించుకుని వాడపల్లి వంతెన మీదుగా గురజాల నియోజకవర్గం పొందుగల గ్రామంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. 14 నియోజకవర్గాల్లో సుమారు 300 కిలో మీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్ర ఘన విజయానికి నేతలు కసరత్తు చేస్తున్నారు. పోస్టర్ ఆవిష్కరణలు, అనుబంధ విభాగాలు, ముఖ్యనేతల సమావేశాలు, రూట్‌మ్యాప్‌ల తయారీ ఇలా యాత్ర ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు.

జిల్లాలోని గురజాల, మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, పొన్నూరు. తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో 300 కిలో మీటర్లు యాత్ర సాగుతోంది. 22 మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్ర ప్రారంభమవుతుంది. సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలతో మమేకమై వారి సాధకబాధకాలను తెలుసుకోవాలనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో యాత్ర సాగుతోంది. జిల్లాలోకి యాత్ర ప్రవేశించే తరుణంలో వేలాది మంది కార్యకర్తలతో ఘనస్వాగతం పలకడానికి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నియోజకవర్గాల నేతలతో సమీక్షలు నిర్వహించి యాత్రకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. యాత్ర విజయవంతం కావాలని కోరుతూ పార్టీ నేతలు మసీదులు, ఆలయాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేత యేటిగడ్డ నరసింహారెడ్డి (యేటిగడ్డ బుజ్జి) ప్రత్యేక పోస్టర్ రూపొందించగా పార్టీ నేతలు ఆవిష్కరించారు. గ్రామస్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు అందరూ యాత్ర విజయవంతానికి విస్తృత కసరత్తు సాగిస్తున్నారు.

అందరూ సహకరించండి.. తలశిల రఘురామ్
జిల్లాలో పాదయాత్ర విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని పార్టీ ప్రొగ్రామ్స్ కమిటి కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ సూచించారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని, నాయకులు అంతా సహకరించాలని కోరారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో యాత్ర త్వరగా మొదలై, త్వరగా ముగుస్తుందని వివరించారు. ఎలాంటి విగ్రహావిష్కరణలు, నివాళులుఅర్పించే కార్యక్రమాలు వుండవని వీటిపై కార్యకర్తలు ఒత్తిడి తేవద్దని, ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే షర్మిల దృష్టికి తీసుకురావాలని కోరారు.
Share:

బాబును నిలదీసిన మహిళలు

వేమూరు : కాంగ్రెస్ నేతల చొక్కాలు పట్టుకుని మౌలిక వసతులపై నిలదీయండని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘మీకోసం..’ పాదయాత్ర 12వ రోజు సోమవారం వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక మహిళలు గట్టిగా నిలదీశారు. ‘రోడ్లు ఆ నాడూ వేసినోళ్లు లేరు. ఈనాడూ వేయలేదు. మేమంతా గుంటల రోడ్ల మీదనే నడవాలా..? ’ అంటూ కఠెవరం విశ్రాంతమ్మ అనే మహిళ ప్రశ్నకు చంద్రబాబు అవాక్కయ్యారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలోనే మహిళలు తమ సమస్యల్ని ఏకరువు పెట్టడం గమనార్హం. ఉదయం 11.30 గంటలకు కూచిపూడి నుంచి పాదయాత్రకు బయల్దేరిన చంద్రబాబు మూల్పూరు, పోతుమర్రు, జంపని గ్రామాల్లో 8 కిలోమీటర్ల దూరం సాగారు. 

ఈ సందర్భం లో మూల్పూరు ఆటోసెంటర్‌లో ఒకరిద్దరు మహిళలు టీడీపీ హయాంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పగా, వారిపై చం ద్ర బాబు సీరియస్ అయ్యారు. రోడ్లు బాగా లేవని, ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయ ని బాధలు చెప్పుకునే క్రమంలో బాబు స్పందిస్తూ కాంగ్రెసోళ్ల చొక్కాలు పట్టుకుని నిలదీయండన్నారు. దళితవాడలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను చూసి ఆయన తట్టుకోలేక.. ఎన్టీఆర్ మాదిగలకు ఎన్నో మంచి పనులు చేసినా ఆయన విగ్రహాలెందుకు పెట్టరూ’ అంటూ చంద్రబాబు కోపంగా మాట్లాడటం స్థానికులకు మనస్తాపాన్ని కలిగించింది. అదేవిధంగా మానుకొండ ఏసోబు అనే వ్యక్తి తమ ప్రార్థనా మందిరంలోకి ఆయన్ను ఆహ్వానించగా, పెద్దగా పట్టించుకోకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

జెడ్పీ హైస్కూలుకు సెలవిచ్చి.. 
చంద్రబాబు పాదయాత్ర పేరుతో కూచిపూడిలో జెడ్పీహైస్కూలుకు సెలవు ప్రకటించి స్వాగతం పలకాలని విద్యార్థులను మండుటెండలో నిలబెట్టారు. అక్కడకొచ్చిన చంద్రబాబు పిల్లలతో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టులు కొరత కారణంగా సకాలంలో సిలబస్ పూర్తికావడం లేదని చెప్పగా.. ఓట్లు లేని వారితో మాట్లాడి ఉపయోగమేంటని ఆయన ప్రశ్నించగా, తమ తల్లిదండ్రులు ఓట్లేస్తారంటూ సమాధాన మిచ్చారు. అనంతరం బాబు పోతుమర్రులో పాదయాత్ర చేసి జంపనిలో రాత్రి బసకు ఆగారు.
Share:

పాదయాత్ర రికార్డుల కోసం కాదు: షర్మిల

పాదయాత్ర రికార్డుల కోసం కాదు: షర్మిల
నల్గొండ: పాదయాత్రలు రికార్డుల కోసం, పండగలు జరుపుకోవడం కోసం కాదని వైఎస్ జగన్ సోదరి షర్మిల అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను మహానేత వైఎస్ఆర్ మహాయజ్ఞంలా చేశారని షర్మిల అన్నారు. నాన్నగారి ఆశీస్సులు, దేవుని దయతో చేస్తోన్న పాదయాత్ర 1000 కి.మీ చేరుకుందని షర్మిల అన్నారు.

పాదయాత్ర చేసిన అన్ని గ్రామాల్లో ప్రజల కన్నీళ్లు, కష్టాలే కనపడుతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంత బాధలో కూడా ప్రజలు రాజన్న రాజ్యం రావాలని, జగనన్న సీఎం కావాలనుకుంటున్నారని షర్మిల అన్నారు. కొండ్రపోల్‌లో వైఎస్ఆర్ విగ్రహానికి స్థలాన్నిచ్చిన సూర్యనారాయణ దంపతులకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు
Share:

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర పోషించారు
ఆ సంస్థతో మొదటి నుంచీ లింకులున్నది ఎవరికి?
హెలికాప్టర్ల కుంభకోణానికీ వైఎస్ కుటుంబాన్ని ముడిపెడతారా?
స్కాంపై కాంగ్రెస్‌ను ప్రశ్నించకుండా వైఎస్ కుటుంబానికి అంటగడతారా? 
కాంగ్రెస్ సర్కారును మోస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ యత్నం 
బాబు కొన్న బెల్-430 కాప్టరే వైఎస్ ప్రాణాలు బలిగొందని రేవంత్ గమనించాలి 

 
‘‘అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఎమ్మార్ సంస్థకు చెందిన ఒక వ్యక్తి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం వెలువడుతోంది. ఎమ్మార్ అనే సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది ఎవరు? ఆ సంస్థతో ఒప్పందం కోసం దుబాయి వెళ్లి 3 రోజులు పర్యటించిదెవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మార్‌కు హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలు పప్పుబెల్లంలా కట్టబెట్టింది ఎవరు? వీటన్నింటికీ చంద్రబాబు తాబేదార్లు సమాధానం చెప్పాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిని ధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ పరిశీలిస్తే హెలికాప్టర్ల కుంభకోణంలో కూడా చంద్రబాబు నిష్ణాతులుగా వెల్లడవుతోందన్నారు. వైఎస్‌ను బలిగొన్న బెల్-430 హెలికాప్టర్ క్రాష్ అవటానికి చంద్రబాబు హస్తం కూడా ఉన్నట్లుందని గట్టు అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ మరణంపై నెలకొన్న అనుమానాలపై చంద్రబాబు నోరు మెదపకపోవటం కూడా అందులో భాగమేనా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి బాగోతాల గురిం చి మాట్లాడితే రోజుల తరబడి చెప్పినా తరగనిదని, ఆయనపై కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలు ముద్రించిందని గుర్తుచేశారు. గట్టు రామచంద్రరావు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి సంఘటనతోనూ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి సంబంధం అంటగట్టి బురద చల్లకపోతే చంద్రబాబు, ఆయన తాబేదార్లకు నిద్రపట్టేట్లులేదని ఎద్దేవా చేశారు. 

పైశాచిక ఆనందానికి పరాకాష్ట... : వైఎస్ కుటుంబాన్ని విమర్శించకపోతే తాము బతికి బట్టకట్టే పరిస్థితిలేదనే భయం వారిలో నెలకొన్నట్లుందని గట్టు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పెద్దల హస్తంతో జరిగిన హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వైఎస్ కుటుంబ ప్రమేయం ఉందని పేర్కొన టం టీడీపీ పైశాచికానందానికి నిదర్శనమని మండిపడ్డారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోళ్లలో భాగంగా బయటపడ్డ అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినది కూడా ఉన్నట్లయితే విచారణ జరిపించాలన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన అవకతలపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రశ్నించకపోగా.. దాన్ని వైఎస్ కుటుంబానికి అంటగట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరమన్నారు. ప్రజలను కష్టాల పాలుచేస్తున్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని తన భుజాలపై మోస్తున్నందు వల్లే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు, ఆయ న తాబేదార్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని గట్టు విమర్శించారు. 

బెల్-430 కొన్నది బాబే కదా! : దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రాణాలను బలిగొన్న హెలికాప్టర్‌పై టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన పలు అనుమానాలు లేవనెత్తారు. ‘‘అవినీతితో కొనుగోలు చేసిన హెలికాప్టర్ వల్లే రాజశేఖరరెడ్డి మరణించారని రేవంత్ చెప్తున్నారు! అయితే బెల్-430 హెలికాప్టర్ కొనుగోలు చేసింది చంద్రబాబే అనే విషయాన్ని ఆయన గుర్తుచేసుకోవాలి. ప్రమాదం జరిగిన ఆ హెలికాప్టర్ కొనుగోలులో చంద్రబాబు ఏమేర అవినీతికి పాల్పడ్డారో ప్రభుత్వం విచారణ చేపట్టాలి. రేవంత్ సైతం వారి పార్టీ అధినేతకు వత్తాసు పలకకుండా ఇదే డిమాండ్ చేయాలి. అగస్టా హెలికాప్టర్ ఎగరటానికి పనికి రాకపోతే.. చంద్రబాబు కొనుగోలు చేసిన బెల్-430 ప్రాణాలు బలిగొందనే విషయాన్ని ఆయన గమనించాలి’’ అని గట్టు పేర్కొన్నారు. 

బాబుకు ప్రజలు విధించిన శిక్ష...: వ్యవస్థలను మేనేజ్ చేసి శిక్షలు తప్పించుకున్న చంద్రబాబుకు ప్రజాకోర్టు విధించిన శిక్షను అనుభవిస్తున్నారని గట్టు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను నరకంలోకి నెట్టినందుకే వారు విధించిన శిక్షను నేడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. ‘బిల్‌క్లింటన్, టోని బ్లేయర్‌లతో కలిసి టీ తాగాను, ప్రపంచంలో చక్రం తిప్పానంటూ చెప్పుకున్న చంద్రబాబును ఒక్క తోపు తోస్తే దేశంలో వచ్చి పడ్డారు. ఫోన్‌ల ద్వారా దేశ ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిందే తానే అంటూ చెప్పుకున్నారు. అక్కడ ఒక్క తోపు తోస్తే రాష్ట్రంలో పడ్డారు. ఇక్కడ ప్రజలు లాగికొడితే నడివీధిలో పడ్డారు’ అని గట్టు ఎద్దేవా చేశారు. వీధుల వెంట తిరుగుతున్న చంద్రబాబు ప్రజలకు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పకుండా వైఎస్ పాలనలో ఇచ్చినవన్నీ తానూ అందిస్తానని చెప్పుకోవటాన్ని బట్టే ఆయన పరిపాలన ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలకు చంద్రబాబు పట్ల విశ్వసనీయత, మాటమీద నిలబడే మనస్తత్వం లేనందు వల్లే ఆయన్ని నమ్మడంలేదన్నారు. టీడీపీ నమ్ముకున్న పార్టీ నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు సైతం ఆ పార్టీని వదిలి వెళ్లటం.. బాబుపై నమ్మకం లేకపోవటం వల్లనేనని తేటతెల్లమవుతోందన్నా
Share:

వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తా


చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ప్రత్యేక ములాఖత్

 తెలుగుదేశం అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోందని, దీనిపై తాను తీవ్రంగా కలత చెందానని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పిరాయి సాయిరాజ్ చెప్పారు. పార్టీలో సమస్యలు పరిష్కరించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి టీడీపీ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. తన రాజకీయగురువు ఎర్రన్నాయుడు అకాలమరణంతో పార్టీలో తన పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. రాజకీయాల నుంచి వైదొలగుదామని నిశ్చయించుకున్న తరుణంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవిధంగా లాభం చేకూర్చాయో గుర్తొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రజాసేవకే పూనుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతానన్నారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సాయిరాజ్ వెంట నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తోపాటు శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ పద్మప్రియ కృష్ణదాస్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ఉన్నారు. 

ప్రజలను మోసగిస్తున్న బాబు: అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో స్పష్టం చేయాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు అన్నారు. తన కుమారుడు, టీడీపీ నేత కలమట వెంకటరమణతో కలిసి శుక్రవారం చంచల్‌గూడ జైల్లో జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై 2008లో కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. వైఎస్ మృతి తర్వాత ఆయన పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందన్నారు. 

విజయమ్మను కలిసిన సాయిరాజ్

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ శుక్రవారమిక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కలమట వెంకటరమణమూర్తి, మోహన్‌రావు విజయమ్మతో భేటీ అయ్యారు. వీరి వెంట ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, సుజయకృష్ణ రంగారావు, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్మాన పద్మప్రియ ఉన్నారు. మరోవైపు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఆంజనేయరాజు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనను వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంజనేయరాజుతో పాటు పలువురు నేతలు పార్టీలో చేరారు. వీరి వెంట పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులున్నారు.



పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేని టీడీపీ సస్పెండ్ చేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నశ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం శాసనసభ్యుడు పిరియా సాయిరాజ్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సాయిరాజ్‌పై ఈ చర్యతీసుకున్నట్టు పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ మీడియాకు పంపిన ఎస్సెమ్మెస్‌లో తెలిపారు. సాయిరాజ్‌తో పాటు శుక్రవారం జగన్‌ను కలుసుకున్న శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకట రమణను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభకు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎన్నికకాగా, ఇప్పటివరకూ 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ప్రస్తుతం శాసనసభలో టీడీపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తరఫున ఉన్న ఏకైక శాసనసభ్యుడైన సాయిరాజ్ కూడా పార్టీని వీడటంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచి టీడీపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది
Share:

రూ. 22 కోట్ల విలువైన పరిశ్రమను రూ. 9.58 కోట్లకే నామాకు ధారాదత్తం చేసిన చంద్రబాబు


నష్టాల్లేని పరిశ్రమను ఖాయిలా తీయించిన చంద్రబాబు ‘పాలసీ’లు
రైతులు, షేర్ హోల్డర్లకు తెలియకుండానే 2002లో అమ్మకానికి
చంద్రబాబు కనుసన్నల్లోనే బిడ్డింగ్ ప్రక్రియ
కలెక్టర్, ఆడిట్ విభాగం అంచనా వేసిన ధరకంటే అతి తక్కువకే నామాకు అప్పగింత
షేర్ హోల్డర్లకు డబ్బులూ ఇవ్వలేదు

 ఒక కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్రవేయాలనేది సామెత..
ప్రభుత్వరంగ సంస్థలను తన వారికి తెగనమ్మాలంటే వాటిని ఖాయిలా పరిశ్రమలుగా మార్చాలనేది చంద్రబాబు పాలసీ..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్క దానిని కూడా బతకనీయలేదు. వాటిని ఆయన అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్రపూరిత ప్రణాళికలతో ఖాయిలా పరిశ్రమలుగా మార్చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇప్లిమెంటేషన్ సెక్రటేరియట్’ను స్థాపించారు. ప్రతి ప్రభుత్వ పరిశ్రమనీ కారుచౌకగా అనుయాయులకు అప్పగించారు. సొంత హెరిటేజ్ డెయిరీ కోసం ప్రభుత్వ డెయిరీనే నాశనం చేసిన బాబు.. మిగతా ప్రభుత్వరంగ సంస్థలకూ ఇదే గతి పట్టించారు.

ఎగుమతులు లేక రాష్ట్రంలో చక్కెర నిల్వలు పేరుకుపోయి షుగర్ ఫ్యాక్టరీలు తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో.. రెండు లక్షల టన్నుల చక్కెర దిగుమతి చేసుకొని రాష్ట్ర పరిశ్రమలను కోలుకోని విధంగా దెబ్బతీశారు. వస్త్ర పరిశ్రమలపై పన్నులు పెంచి స్పిన్నింగ్ మిల్లులను పెను సంక్షోభంలోకి నెట్టారు. చంద్రబాబు విధానాలతో రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిని, నష్టాల ఊబిలోకి కూరుకుపోయాయి. ఆ వెంటనే వాటిపై ఖాయిలా ముద్ర వేసి, తన పని కానిచ్చేశారు. ఇలా నష్టాల సాకుతో 71 సహకార చక్కెర, స్పిన్నింగ్ మిల్లులను దశలవారీగా ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళిక రచించారు. దాదాపు రూ.1,500 కోట్ల విలువ చేసే 20 మిల్లులను కేవలం రూ.300 కోట్లుకు అమ్మేశారు. వీటిలో ఖమ్మం జిల్లాలోని పాలేరు షుగర్స్ కూడా ఒకటి. ఎటువంటి నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమను ముందుగా ఖాయిలా పడేలా చేశారు. ఆ తర్వాత బిడ్డింగ్ డ్రామాతో బాబుకు సన్నిహితుడైన నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ చేతుల్లో పెట్టారు. రైతులు, షేర్ హోల్డర్లకు, కనీసం సహకార సంఘం సభ్యులకు కూడా చెప్పకుండా ఈ మంత్రాంగమంతా నడిపించేశారు. రూ. 22 కోట్లు విలువైన కర్మాగారాన్ని కేవలం రూ. 9.58 కోట్లకే ధారాదత్తం చేశారు.

రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరీపురం, అమ్మగూడెం గ్రామాల మధ్య 1976లో పాలేరు చక్కెర కర్మాగారాన్ని నిర్మించారు. 1984లో ఇక్కడ చక్కెర ఉత్పత్తి మొదలైంది. ఈ కర్మాగారంలో 84 శాతం ప్రభుత్వ వాటా కాగా, 16 శాతం రైతుల వాటా ఉంది. అప్పట్లో ఒక్కొక్క షేర్ రూ.500 చొప్పున మూడు వేల మంది రైతులు 4,600 షేర్లు కొనుగోలు చేశారు. 2002 డిసెంబర్‌లో ఈ పరిశ్రమను నామా నాగేశ్వరరావుకు అప్పగించే సమయానికి ఈ షేర్ల విలువ రూ.3 కోట్లు. ఎటువంటి లాభ నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమ చంద్రబాబు ఆర్థిక విధానాల పుణ్యమా అని నష్టాల్లోకి వెళ్లింది. తొలిసారిగా రూ.2 కోట్ల రన్నింగ్ నష్టం వచ్చింది. ఇదే కారణాన్ని చూపి చంద్రబాబు 2002లో కంపెనీని అమ్మకానికి పెట్టారు. ఈ విషయం ముందుగా రైతులకు, షేర్ హోల్డర్లకు తెలియజేయలేదు. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వమే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.సుబ్రమణ్యం చైర్మన్‌గా ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసింది.

‘పాలేరు షుగర్స్‌ను నమ్ముకొని ప్రత్యక్షంగా 8 వేల మంది రైతులు, 3 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వం కొద్దిగా చేయూతనందిస్తే ఈ పరిశ్రమ అన్ని సమస్యలను అధిగమించి, మెరుగైన లాభాలను ఆర్జిస్తుంది’ అని ఈ కమిటీ సిఫారసు చేసింది. చంద్రబాబు ఈ సూచనలను పట్టించుకోలేదు. కనీసం స్థానిక సహకార సంఘం అనుమతి కూడా తీసుకోకుండా 280 నుంచి 328 వరకు సర్వే నంబర్లలో ఉన్న 134. 23 గుంటల భూమితో పాటు, యంత్రాల విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 134 ఎకరాల భూమి విలువ రూ.9.40 కోట్లు, యంత్రాలు, ఇతర వస్తువుల విలువ రూ.12 కోట్లు, మొత్తం రూ.21.40 కోట్లుగా అప్పటి జిల్లా కలెక్టర్ లెక్కించారు. జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం దీని విలువ రూ.22 కోట్లుగా అంచనా వేసింది. ఇక బిడ్డింగ్ వ్యవహారమంతా చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచింది.

ఎవరు బిడ్ వేయాలి, ఎంత సొమ్ము కోట్ చేయాలి, డమ్మీలుగా ఎవరు బిడ్ వేయాలో ముందే నిర్ణయమైంది. ఈ పథకం ప్రకారం నామా నాగేశ్వర్‌రావు రూ.9,58,88,888కు బిడ్ వేయగా, పి.వెంకటేశ్వర్లు రూ.7,77,15,000కు బిడ్ వేశారు. ఇతను డమ్మీ అభ్యర్థి అని అందరూ చెబుతుంటారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, చంద్రబాబు సన్నిహితుడు గోకరాజు రంగరాజుకు ఒక రకంగా ఖమ్మం జిల్లా ముఖ్య వ్యాపార కేంద్రం. ఆయన వ్యాపారమంతా ఇక్కడే ఉంది. అలాంటిది గోకరాజు పాలేర్ షుగర్స్ కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు. దీనినిబట్టి చూస్తే పథకం ప్రకారమే అంతా జరిగిందన్న విషయం బోధపడుతుంది. 2002 డిసెంబర్‌లో పరిశ్రమ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ సంస్థ పరమైంది. అప్పటికి పరిశ్రమలో 30 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. వీటి విలువే రూ.2.10 కోట్లు ఉంటుందని అంచనా. రైతుల షేర్ల విలువ రూ.3 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వంగానీ, నామా నాగేశ్వర్‌రావు గానీ రైతులకు చెల్లించలేదు. ఈ విధంగా జిల్లా కలెక్టర్ అంచనా వేసిన విలువ (21.40 కోట్లు)కన్నా, జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం అంచనా (22 కోట్లు)కన్నా అతి తక్కువ ధర (రూ.9.58 కోట్లు)కే పాలేరు షుగర్స్ ఫ్యాక్టరీ నామా వశమైంది. ప్రస్తుతం ఆ కర్మాగారం రోజుకు 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, క్రషింగ్ సామర్థ్యంతో పనిచేస్తోంది.

బాబు సంతర్పణలు మరికొన్ని..

రూ.35 కోట్లు విలువచేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును కేవలం రూ. 12.33 కోట్లకే చంద్రబాబుకు సన్నిహితుడైన సి.ఎం.రమేష్‌కు చెందిన రిత్విక్ ఎంటర్ ప్రైజెస్‌కు కట్టబెట్టారు. రూ.6 కోట్ల విలువైన గురజాల చక్కెరమిల్లు, రూ.30 కోట్లు పలికే ఇంకొల్లు నూలు మిల్లును కలిపి కేవలం రూ.9.86 కోట్లకే నూజివీడు సీడ్స్‌కు ఇచ్చేశారు. ఈ సంస్థ టీడీపీతో సన్నిహితంగా మెలుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని ఏకంగా అప్పటి హోం మంత్రి దేవేందర్‌గౌడ్ తమ్ముడు అశోక్ గౌడ్ కొన్నారు. ఇవే కాకుండా నిజాం షుగర్స్, పాలకొల్లు, నంద్యాల, హిందూపురం చక్కెర మిల్లులు, అదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లును కూడా చంద్రబాబు పరివారగణానికి కారుచౌకగా ధారాదత్తం చేశారు.

అక్రమాలపై చర్యలేవీ: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

 నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అక్రమాలపై కోర్టులు జోక్యం చేసుకొనేంతవరకు చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కే యాదవరెడి ్డ, కేఆర్ ఆమోస్ విమర్శించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా నిజాం షుగర్స్‌ను, రూ.కోట్ల విలువైన ఆస్తులను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని, ఇందులో అప్పటి మంత్రులు, అధికారులకు కూడా సంబంధముందని ఆరోపించారు. సభాసంఘం సిఫార్సులను అమలు చేయకపోవడానికి కారణాలేమిటో బయటకు రావాలన్నారు. నిజాం షుగర్స్‌ను కొనుగోలు చేసిన వ్యక్తులకు అధికారంలో ఉన్న వారితో బంధుత్వాలు ఉన్న కారణంగానే కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేద ని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

తప్పుడు అప్పులు చూపారు: కేటీఆర్

నిజాం షుగర్స్‌కు తప్పుడు అప్పులు చూపించి అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తక్కువ ధరకు అమ్మేశారని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కె.తారక రామారావు  ఆరోపించారు. ఈ అమ్మకం అతిపెద్ద ఆర్థిక అవకతవకలతో కూడుకున్నదని శాసనసభా కమిటీ తప్పుపట్టిందని, హైకోర్టు కూడా మందలించిందన్నారు. చంద్రబాబుతోపాటు అప్పటి ఆర్థిక, పరిశ్రమలు, చక్కెర శాఖామంత్రులు ఈ ఆర్థిక నేరానికి బాధ్యులని శాసనసభా కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అనంతరం వైఎస్, రోశయ్య, కిరణ్ సీఎంలుగా ఉన్నా చర్యలు తీసుకోకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ల్యాంకో, జీఎంఆర్ విద్యుత్ సంస్థల నుంచి కరెంట్‌ను ఎక్కువ ధరకు కొనడం తో ప్రజలపై రూ.2 వేల కోట్ల భారం పడిందన్నారు. ల్యాంకో, జీఎంఆర్ నుంచి డబ్బు రికవరీ చేయకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. 
Share:

బాబు, కిరణ్‌ల ఇలాకాలో పరస్పర ‘సహకారం’

డీసీసీబీ చైర్మన్‌గా అమాస, డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్యామరాజు 
21 మంది ఉన్నా డీసీఎంఎస్‌కు నామినేషన్లే వేయని కాంగ్రెస్ 
కాంగ్రెస్ - టీడీపీల మధ్య రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన చీకటి పొత్తు చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల సందర్భంగా మరింత బలపడింది. టీడీపీ సహకారంతో కాంగ్రెస్ చిత్తూరు డీసీసీ బ్యాంకు ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా టీడీపీకి డీసీఎంఎస్ చైర్మన్ పదవితో పాటు పాలకవర్గం మొత్తం అప్పగించేందుకు మార్గం సుగమం చేసింది. 59 సింగిల్ విండోలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 21 గెలవటం ఆ రెండు పార్టీలకు ఆందోళన కలిగించింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన 8 విండోలను డీఫాల్ట్ జాబితాలో చేర్పించిన కాంగ్రెస్ పార్టీ.. నామ్‌కే వాస్తే అన్నట్లుగా టీడీపీకి చెందిన ఒక విండోను కూడా ఇందులో చేర్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు గాలిముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి రెండు పార్టీల మధ్య పదవులు పంచుకునే ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. 

ఇవి ఫలించటంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆమోదంతో డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌కు ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. పెద్ద పంజాణికి చెందిన కాంగ్రెస్ సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి డీసీసీ బ్యాంకు డెరైక్టర్‌గా నామినేషన్ వేయటానికి ప్రతిపాదకుడు తక్కువ పడ్డారు. దీంతో విజయభాస్కర్‌రెడ్డిని కుప్పం నియోజకవర్గం శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజు ప్రతిపాదించారు. ఏ క్లాస్‌లో 16 డెరైక్టర్ స్థానాలకు రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో 9 కాంగ్రెస్, 3 టీడీపీ పంచుకుని నామినేషన్లు వేయించుకున్నారు. బి క్లాస్‌లోని 5 డెరైక్టర్ స్థానాలకు కాంగ్రెస్ మద్దతుదారులైన ముగ్గురే నామినేషన్ వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత మిగిలిన డెరైక్టర్లను రెండు పార్టీలు ఒక అవగాహనతో కో-ఆప్షన్ పద్ధతిలో నామినేట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

డీసీఎంఎస్ పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్

టీడీపీతో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీ డీసీఎంఎస్ పాలకవర్గం ఎన్నికల నుంచి తప్పుకుంది. మొత్తం 10 డెరైక్టర్ పదవులకు రిజర్వేషన్ అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో టీడీపీ 7 నామినేషన్లు మాత్రమే దాఖలు చేసింది. టీడీపీకి చెందిన శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజును చైర్మన్ చేయటానికి రంగం సిద్ధం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ పదవి కూడా టీడీపీకే ఇవ్వటానికి కాంగ్రెస్ సుముఖంగా ఉంది
Share:

టీడీపీ కంచుకోట బద్దలు!

ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకప్పడు తనకు కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేం పార్టీ అత్యంత దయనీయ స్థితికి దిగజారిపోయింది. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితిలో పడిపోయింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం) వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి వెన్నంటి నిలిచారు. ఆ వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీప్రకటించడంతో జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండాపోయారు. 1983 తరువాత జిల్లాలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన 1983 ఎన్నికల్లో ఉన్న 12 స్థానాల్లో 11 చోట్ల ఆ పార్టీ గెలిచింది. సోంపేట మినహా అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. 1985లో పది స్థానాలు చేజిక్కించుకుంది. కాగా 1989లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీరామారావు వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ జిల్లాలో మాత్రం ఆ పార్టీ ఎనిమిది స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. 1994 ఎన్నికల్లో జిల్లాలో 11(అందులో ఒకటి టీడీపీ అనుబంధ సభ్యుడు) స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 1999 ఎన్నికల్లో కూడా టీడీపీ 11 స్థానాలు గెలుచుకుంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో జిల్లాలో టీడీపీ తిరోగమనం ప్రారంభమైంది. 

ఆ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ ప్రత్యర్థి పార్టీ కంటే తక్కువ సీట్లకు పరిమితమైంది. వైఎస్ జనాదారణతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు చోట్ల ఘనవిజయం సాధించగా.. టీడీపీ ఐదు సీట్లకే పరిమితమైంది. కాగా 2009 ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గి 10 స్థానాలు ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో వై.ఎస్. నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ ఒక్క ఇచ్ఛాఫురం నియోజకవర్గంలోనే గెలిచింది. వైఎస్ మరణానంతరం జిల్లా రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే సాయిరాజ్ పునరాలోచనలో పడ్డారు. ప్రజాభీష్టం మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలవాలని నిర్ణయించారు. ఆయన శుక్రవారం జగన్‌ను కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతోనూ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి దృష్ట్యా జగన్ తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. దాంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. విధిలేని పరిస్థితుల్లో సాయిరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ ఇక కోలుకోవడం దుర్లభమేనని టీడీపీ శ్రేణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నాయి
Share:

జగనన్నను చూడాలని ఉంది...

ఆంధ్రుల ప్రియతమ నాయకుడు, కడప ఎం.పి, వైయస్సార్ ిసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ‘ఆస్తులు సంపాదించుకున్నారు’ అనే నింద మోపి సీబీఐ విచారణ పేరిట ఈ ప్రభుత్వం జగనన్నను జైలుపాలు చేసి రాష్ట్రప్రజలను ఎంతో బాధకు, ఆవేదనకు గురి చేసింది. విచారణ కొనసాగింపు పేరుతో ఎనిమిది నెలలు దాటినా విడుదల చేయలేదు. ఆంధ్రప్రజలు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించిన జగన్‌ని ఇన్నిరోజుల పాటు కళ్లకి కనపడకుండా, జైలు గోడల మధ్య ఉంచడం ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. జగన్ త్వరలోనే బయటికి రావాలని, గాడి తప్పి పక్కదోవ పడుతున్న రాష్ట్ర రాజకీయాలను చక్కదిద్ది, సక్రమ మార్గంలో నడపాలని కోరుకుంటున్నాను.

- నాగ బ్రహ్మం, ఒంగోలు

సూర్యుడు ఉండాల్సింది మబ్బుల చాటున కాదు!


కొమ్మపై కూర్చున్న పక్షి పెనుగాలికి కొమ్మ ఊగినా, విరిగినా భయపడదు. ఎందుకంటే ఆ పక్షికి కొమ్మలు, చెట్టురెమ్మల కంటే తన రెక్కల పైనే విశ్వాసం. అలాగే మా జగనన్నకు తన మీద తనకు నమ్మకం ఉంది. మాకూ ఆయన మీద నమ్మకం ఉంది. కల్లాకపటం తెలియని నవ్వుతో నిష్కల్మషంగా ఉండే మా జగనన్న అనునిత్యం ప్రజల గుండెల్లో చోటుకోసం మాత్రమే తపిస్తుంటారు. ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రజాసమస్యలపై పోరాడేతత్వం, ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం జగనన్నలో ఉన్నాయి. లీడర్ అంటే ఇలాగే ఉండాలని ఆనాడు మహానేత వైయస్సార్ గారిని చూసి అనుకున్నాం. ఈరోజు అలా జగనన్నని చూస్తున్నాం. తండ్రి వారసత్వాన్నే కాక ఆయన ఆశయాలనూ వారసత్వంగా స్వీకరించిన పులిబిడ్డ మా జగనన్న. అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని వైయస్సార్ ఆనాడు తన పాదయాత్రతో తిరిగితెస్తే... ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఓదార్పుయాత్రతో అధికారాన్ని, పదవినీ త్యాగం చేసిన యువనేత జగన్.

పార్టీలు, పదవులు శాశ్వతం కాదని నమ్మి, ప్రజల కోసమే ఆయన రాజకీయాలలోకి వచ్చారు. అలాగే నాయకుడనేవాడు ఎన్నేళ్లు పరిపాలించామని కాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలించాలని వైఎస్సార్ అనేవారు. ఆ మాటనే జగన్ నేడు ఆచరిస్తున్నారు. వైఎస్సార్ మరణంతో మన రాష్ట్రానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందనీ, ఆ లోటును జగనన్న తప్ప మరెవరూ భర్తీ చేయలేరనీ గుర్తించి, ఆ నిజాన్ని భరించలేకపోయిన ప్రభుత్వం, ప్రతిపక్షం, ఈ రెండు పార్టీలకు తొత్తులుగా మారిన ఎల్లో మీడియా కలిసి నీచ రాజకీయాలతో కుమ్మక్కయి, కుట్రపన్ని మహానేత కుటుంబంలో ఆడపడుచులను సైతం రోడ్డుపైకి వచ్చేటట్లు చేశారు.

పదవుల కోసం, అధికారం కోసం ఆనాడు వైఎస్సార్‌తో ఉన్న వాళ్లంతా ఇప్పుడు జగన్‌కు దూరం అయ్యారు. అయితేనేం, ఆనాడు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు మాత్రం నేటికీ పెద్దాయన కుటుంబంతోనే ఉన్నారు. జగనన్నపై ఆదరణ కురిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కుటిలకూటములు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వై.ఎస్. కుటుంబ సభ్యులను వేధించడం మానుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడ్డానికి సిద్ధం కావాలి. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఉండవలసింది మబ్బులచాటున గాదు, ప్రజల మధ్యలో. ఆ విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. నా కుటుంబమే నా ప్రపంచం అనుకోకుండా ఈ ప్రపంచమే నా కుటుంబం అని ముందుకు సాగుతున్న వై.ఎస్. కుటుంబానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి
Share:

Popular Posts

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.