మరో ప్రజాప్రస్థానానికి సన్నద్ధం..

గుంటూరు : మరో ప్రజాప్రస్థానానికి జిల్లా సన్నద్ధమైంది. పాలకుల నిర్లక్ష్యానికి గురై సమస్యల వలయంలో సతమతమవుతున్న ప్రజానీకానికి బాసటగా నిలవాలనే మహా సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా ఈ నెల 22 నుంచి గుంటూరు జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లాలో ముగించుకుని వాడపల్లి వంతెన మీదుగా గురజాల నియోజకవర్గం పొందుగల గ్రామంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. 14 నియోజకవర్గాల్లో సుమారు 300 కిలో మీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్ర ఘన విజయానికి నేతలు కసరత్తు చేస్తున్నారు. పోస్టర్ ఆవిష్కరణలు, అనుబంధ విభాగాలు, ముఖ్యనేతల సమావేశాలు, రూట్‌మ్యాప్‌ల తయారీ ఇలా యాత్ర ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు.

జిల్లాలోని గురజాల, మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, పొన్నూరు. తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో 300 కిలో మీటర్లు యాత్ర సాగుతోంది. 22 మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్ర ప్రారంభమవుతుంది. సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలతో మమేకమై వారి సాధకబాధకాలను తెలుసుకోవాలనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో యాత్ర సాగుతోంది. జిల్లాలోకి యాత్ర ప్రవేశించే తరుణంలో వేలాది మంది కార్యకర్తలతో ఘనస్వాగతం పలకడానికి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నియోజకవర్గాల నేతలతో సమీక్షలు నిర్వహించి యాత్రకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. యాత్ర విజయవంతం కావాలని కోరుతూ పార్టీ నేతలు మసీదులు, ఆలయాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేత యేటిగడ్డ నరసింహారెడ్డి (యేటిగడ్డ బుజ్జి) ప్రత్యేక పోస్టర్ రూపొందించగా పార్టీ నేతలు ఆవిష్కరించారు. గ్రామస్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు అందరూ యాత్ర విజయవంతానికి విస్తృత కసరత్తు సాగిస్తున్నారు.

అందరూ సహకరించండి.. తలశిల రఘురామ్
జిల్లాలో పాదయాత్ర విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని పార్టీ ప్రొగ్రామ్స్ కమిటి కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ సూచించారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని, నాయకులు అంతా సహకరించాలని కోరారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో యాత్ర త్వరగా మొదలై, త్వరగా ముగుస్తుందని వివరించారు. ఎలాంటి విగ్రహావిష్కరణలు, నివాళులుఅర్పించే కార్యక్రమాలు వుండవని వీటిపై కార్యకర్తలు ఒత్తిడి తేవద్దని, ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే షర్మిల దృష్టికి తీసుకురావాలని కోరారు.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.