* ఓటమి భయంతో రెండేళ్లుగా వాయిదా వేసిన సర్కారు
* ఇప్పుడు ‘పార్టీరహితం’ మాటున గండం గట్టెక్కే ఎత్తుగడ
* పరువు నిలుపుకునే వ్యూహాలకు ఇప్పటినుంచే పదును
ఎట్టకేలకు స్థానిక ఎన్నికల నగారా మోగింది.
ఓటమి భయంతో నానా సాకులతో రెండేళ్లుగా ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న రాష్ట్ర సర్కారు ఎత్తుగడలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. పంచాయతీరాజ్ సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సోమవారం ఆదేశించింది. 2001 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని, 60.55 రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని, వెనకబాటుతనంపై మూడు నెలల్లో అధ్యయనం పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. 2006లో నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. భవిష్యత్తులో స్థానిక రిజర్వేషన్లు ఎలా ఉండాలన్న అంశంపై మరోమారు విచారించి నిర్ణయిస్తామని తెలిపింది. సుప్రీం తీర్పుతో అధికార కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
అత్యంత తక్కువ ఓట్లతో జరిగిన సహకార ఎన్నికలను అటు అధికార, ధన బలాలు, విపక్ష టీడీపీ సహకారంతో ఎలాగోలా గట్టెక్కినా.. స్థానిక ఎన్నికల్లో మాత్రం ప్రజాగ్రహం తమ పుట్టి ముంచడం ఖాయమని ఆందోళన చెందుతోంది. ఎన్నికలు జరిగితే క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీలు బలోపేతమవుతాయనే భయంతోనే రెండేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నామన్నది బహిరంగ రహస్యమేనని అధికార పార్టీ నేతలే అంటున్నారు! ముందు పార్టీరహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం గండం గట్టెక్కజూస్తోంది

No comments:
Post a Comment